లక్షలాది మందికి అన్నం.. 2,000కి
Actor ProfileActor

లక్షలాది మందికి అన్నం.. 2,000కి

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources3
లక్షలాది మందికి అన్నం.. 2,000కిపైగా మీల్ కిట్లు
Chitrajyothy23 Dec 2026
లక్షలాది మందికి అన్నం.. 2,000కిపైగా మీల్ కిట్లు

అభిమాన హీరోపై ప్రేమను కేవలం సినిమా, ఫ్యాన్స్‌ ఈవెంట్స్‌ వరకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఎన్టీఆర్ మీల్’ మరోసారి చూపించింది. అభిమాన హీరోపై ప్రేమను కేవలం సినిమా, ఫ్యాన్స్‌ ఈవెంట్స్‌ వరకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఎన్టీఆర్ మీల్’ మరోసారి చూపించింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో సాగిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆకలితో ఉన్న ఎంతోమందికి భోజనం అందించారు. ‘ఎన్టీఆర్ మీల్’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు లక్షలాది మంది ఆకలి తీర్చినట్లు, 2,000కిపైగా మీల్ కిట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు.. వివిధ ప్రాంతాల్లో వాలంటీర్లు, బలమైన టీమ్‌ కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఒకే లక్ష్యంతో పనిచేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమం గురించి ఓ అభిమాని సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. “లక్షలాది మందికి ఆహారం, 2,000కిపైగా మీల్ కిట్లు, అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు, బలమైన టీమ్‌.. ఇదే ‘ఎన్టీఆర్ మీల్’ ప్రభావం” అంటూ ప్రశంసించారు. ఇదే స్థాయిలో మరో టాలీవుడ్‌ హీరో అభిమానులు సేవా కార్యక్రమం నిర్వహించి ఉంటే ఇప్పటికి విస్తృతంగా ప్రశంసలు, గుర్తింపు లభించేవని అభిప్రాయపడ్డారు. ‘ఎన్టీఆర్ మీల్’ చేసిన సేవను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం గురించి పెద్దగా ప్రచారం లేకపోయినా.. ఇది చేసిన సేవే దాని ప్రభావానికి నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ మీల్’ సేవలు నిలిచిపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో “Hope you’ll be back soon, bro” అంటూ సేవా కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నారు

ఒక్కరోజే రూ. 3,000కి పైగా పెరిగిన బంగారం ధరలు
TeluguOne1 Dec 2026
ఒక్కరోజే రూ. 3,000కి పైగా పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు మరియు ఆభరణాల కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ షాకింగ్ న్యూస్ అందించింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టి ఊరటనిచ్చిన బంగారం ధరలు, ఆగస్టు 11 మంగళవారం నాటికి ఒక్కసారిగా

ఏపీలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు
TeluguOne1 Dec 2026
ఏపీలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు

విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరో 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనను

కంచంలో ఉన్నది అమృతమేనా
Sakshi2 Oct 2026
కంచంలో ఉన్నది అమృతమేనా

‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్‌ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది