Gold Bond Returns : సావరిన్ గోల్డ్ బాండ్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2020-21 సిరీస్ IX ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ డేట్, ప్రైస్ ప్రకటించింది. 2021 జనవరి 5న దీనిని ఇష్యూ చేయగా.. ఐదేళ్లు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 2026, జులై 4 నుంచి రిడీమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా గోల్డ్ బాండ్ల కాల పరిమితి 8 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ ఐదేళ్లు ముగిసిన తర్వాత కూడా పాక్షికంగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది ఆర్బీఐ. దీంతో గతంలో ఈ గోల్డ్ బాండ్ సిరీస్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు ముందస్తుగా డబ్బులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంటే.. అదే ధరను ప్రకటిస్తుంది. కానీ ఇక్కడ ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) ధరల్ని ఆధారంగా తీసుకుంటారు. ఇష్యూ డేట్, రిడెంప్షన్ డేట్‌కు ముందు 3 రోజుల సగటు ధరను తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ 2020-21 సిరీస్ IX ముందస్తు విమోచన ధరను (ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్) రూ. 14,366 గా నిర్ణయించింది. ఇక్కడ జులై 1, 2, 3 తేదీ ధరల సగటు ఇది. గతంలో 2021లో ఈ గోల్డ్ బాండ్ సిరీస్ ఇష్యూ సమయంలో గ్రాము బంగారం ధర రూ. 5 వేలుగా నిర్ణయించింది. అయితే ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ వస్తుంది. ఈ లెక్కన వారికి గ్రాము రూ. 4,950 కే వచ్చిందన్నమాట. ఇక్కడ రాబడి చూస్తే గ్రాముపైనే రూ. 14366- రూ. 4950= రూ. 9,416 లాభం వచ్చింది. ఇది శాతం పరంగా చూస్తే 190 శాతం మేర రిటర్న్స్ వచ్చాయి. లక్ష ఇన్వెస్ట్
Actor ProfilePolitician
లక్షకు 3 లక్షలు.. 3 లక్షలకు 9 లక్షలు.. గోల్డ్ బాండ్స్ మ్యాజిక్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•26 Sept 2026
లక్షకు 3 లక్షలు.. 3 లక్షలకు 9 లక్షలు.. గోల్డ్ బాండ్స్ మ్యాజిక్, ఐదేళ్లలోనే దశ తిరిగింది