లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలి
Actor ProfileCelebrity

లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలి
Namasthe Telangana5 Dec 2026
లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలి

కొత్తగూడెం ఏరియాలో డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏరియా రివ్యూ సమావేశం రుద్రంపూర్, ఆగస్టు 11 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలని సింగరేణి డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో ఏరియా రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీహెచ్.వెంకటరమణను డైరెక్టర్ (పి&పి) కె.వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం కొత్తగూడెం ఏరియా పరిధిలోని గనుల వారీగా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, ప్రాజెక్టుల పురోగతి, ఓవర్‌బర్డెన్ తొలగింపు, బొగ్గు నాణ్యత, రవాణా, యంత్రాల వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు తమ విభాగాల పనితీరు, పురోగతిని డైరెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు గనుల అభివృద్ధి పనులను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. గనుల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని డైరెక్టర్ స్పష్టం చేశారు. కార్మికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు కార్మికుల సురక్షిత పని వాతావరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, లక్ష్యాల సాధనకు సమష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏరియా జీఎం సీహెచ్. వెంకటరమణ, ఎస్‌ఓ టు జీఎం ఎం. గోవిందరావు, పీవీకే ఏజెంట్ రామ్ భరోస్ మహాతో, ఫైనాన్స్ ఏజీఎం బిబత్స, సివిల్ ఏజీఎం రామకృష్ణ, డీజీఎం (ఐఈడీ) యోహన్, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, పర్సనల్ మేనేజర్