లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా
Actor ProfileActor

లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా
123Telugu17 Nov 2026
లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరో.. నిజమేనా

తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన లేటెస్ట్ చిత్రం ‘డిసి’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. ఎలాంటి ప్రమోషన్లు, ఆర్భాటాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండో రోజు మంచి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుని విజయం వైపు దూసుకెళ్తోంది. అయితే, ఈ కథలో మొదటి ఛాయిస్ లోకేష్ కనగరాజ్ కాదట. మొదట దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ లైన్‌ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు వినిపించాడని.. తాను అప్పటికే చేస్తున్న సినిమాల తరహాలోనే ఉండటంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను నో చెప్పాడని తెలుస్తోంది. ఆ తర్వాతే ఈ అవకాశం లోకేష్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజయ్ దేవరకొండ పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి జంటగా నటించిన ఈ తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు