లో రామ్ చరణ్ కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా
Actor ProfileActor

లో రామ్ చరణ్ కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లో రామ్ చరణ్ కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా
NTV Telugu21 Jan 2027
లో రామ్ చరణ్ కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా

RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ‘RC17’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్‌ నెలకొంది. పుష్పా సక్సెస్‌తో సుకుమార్ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం, పెద్దితో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి బజ్ ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పలువురు స్టార్ హీరోయిన్స్‌ పేర్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. ‘ధురంధర్‌’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్‌.. ‘RC17’లో హీరోయిన్‌గా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ సినిమాలో కియారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం సారా అర్జున్‌ను ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్‌, సారా అర్జున్‌ కాంబినేషన్‌ తెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అలాగే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను మేకర్స్ సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ ఇప్పటికే ‘RC17’ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌ తన చేతి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత నవంబర్‌ 2026 నుంచి