చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎంత అందం, అభినయం ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద విజయం దక్కకపోతే హీరోయిన్లపై 'ఐరన్ లెగ్' అనే ముద్ర వేయడానికి పరిశ్రమ వెనుకాడదు. భాగ్యశ్రీ బోర్సే సైతం టాలీవుడ్‌లో సరిగ్గా ఇలాంటి విచిత్రమైన పరిస్థితినే ఎదుర్కొంది. మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ లాంటి భారీ డిజాస్టర్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ భామకు, ఆ తర్వాత నటించిన ‘కాంత’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలు డీసెంట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. దీంతో ఈ అమ్మడి టాలెంట్ కంటే బ్యాడ్ లక్ గురించే పరిశ్రమలో చర్చ నడిచింది. కానీ, తాజాగా విడుదలైన ‘ లెనిన్ ’ చిత్రం ఈ బ్యూటీ జాతకాన్ని పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది.* ‘హైదరాబాద్ నా కర్మ భూమి.. చివరి సినిమా కూడా ఇక్కడే చేస్తా’ – స్టేజ్‌పైనే ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సేగండం గట్టెక్కిన భాగ్యశ్రీ అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద యునానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్ లో ‘పెద్ది’, ‘మా ఇంటి బంగారం’ చిత్రాల తర్వాత మొదటి రోజే మెయిన్ సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు పడేలా చేసిన సినిమా ఇదే కావడం విశేషం. గత వారం వచ్చిన సినిమాల జోరు తగ్గడంతో, బాక్సాఫీస్ వద్ద అఖిల్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి 'భారతి' పాత్రలో భాగ్యశ్రీ బోర్సే అద్భుతమైన నటనను కనబరిచింది. * మా వాడికి ఒక్క హిట్టు ఇవ్వవయ్యా స్వామీ.. అని ఆ ఏడుకొండలవాడిని వేడుకున్నా - నాగార్జునఫస్టాఫ్‌లో ప్రేమకథ, ఇంటర్వెల్ ముందు బరువైన ఎమోషన్స్, సెకండాఫ్‌లో హోమ్లీ లుక్, క్లైమాక్స్ ట్విస్ట్‌లలో దర్శకుడు కథను ఆమె చుట్టూనే నడిపించారు. పెర్ఫార్మెన్స్ పరంగా దక్కిన ఈ లక్కీ ఛాన్స్‌ను భాగ్యశ్రీ వంద శాతం ఉపయోగించుకోవడంతో
Actor ProfileActor
లెనిన్’ హిట్ తో మారిన భాగ్యశ్రీ బోర్సే జాతకం.. ఐరన్ లెగ్’ ముద్ర చెరిపేసిన భారతి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•30 Oct 2026
లెనిన్’ హిట్ తో మారిన భాగ్యశ్రీ బోర్సే జాతకం.. ఐరన్ లెగ్’ ముద్ర చెరిపేసిన భారతి