
Akhil Recent Movies 1st Day Collections: టాలీవుడ్ లెజండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు మనవడు..అక్కినేని నాగార్జున రెండు కుమారుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అఖిల్. అయినా కెరీర్ పరంగా ఒక అడుగు ముందుకు వేస్తే..మూడడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది అయ్యవారి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ శుక్రవారం ‘లెనిన్’మూవీతో పలకరించాడు. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో అఖిల్ హీరోగా నటించిన తాజాగా చిత్రంతో పాటు అతని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ సినిమా డీసెంట్ స్టార్ట్ అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.26 కోట్ల షేర్ అందుకుంది. అఖిల్ హీరోగా మమ్ముట్టి మరో ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘ఏజెంట్’.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొదటి రోజు రూ. 4.95 కోట్ల షేర్ అందుకుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 4 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం టోటల్ రన్‌లో రూ. 6.9 కోట్ల షేర్ మాత్రమే అందుకొని బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో నిర్మించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ డే రూ. 6.80 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు స్టేట్స్‌లో రూ. 5.45 కోట్ల షేర్ వసూళు చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమా ప్రపంచ