లెనిన్' రివ్యూ
Actor ProfilePolitician

లెనిన్' రివ్యూ

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్
Samayam Telugu22 Oct 2026
అఖిల్ అక్కినేనికి సమంత బెస్ట్ విషెస్.. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ పోస్ట్

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'లెనిన్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇవాళ శుక్రవారం (జులై 10) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. యూఎస్

లెనిన్' రివ్యూ
Samayam Telugu20 Oct 2026
లెనిన్' రివ్యూ

అఖిల్ అక్కినేని తన కెరీర్ ఆరంభం నుంచీ ఓ సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నాగార్జున సైతం తన కొడుకు హిట్టు కోసం చాలానే కష్టపడుతూ వచ్చాడు. ఇక చివరగా ఏజెంట్ అంటూ డిజాస్టర్‌ను ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని, ఆచితూచి అడుగులు వేసి ‘లెనిన్’ అంటూ ఈ రోజు (జూలై 10) ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది అన్నది ఓ సారి చూద్దాం. కథ శ్రీరామపురంలో జరిగే మహాభారతమే ఈ కథ. ఈ ఊరి పెద్దగా జయంతమ్మ (ఈశ్వరీ రావు) వ్యవహరిస్తుంటుంది. ప్రతీ ఏటా జరిగే భారతం మిట్టలో ధర్మరాజు ఎవరిని నిలబెట్టాలి, జాతరను ఎవరు జరిపించాలని జయంతమ్మ నిర్ణయిస్తుంటుంది. జయంతమ్మకి సొంత కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు), పెంచుకున్న కొడుకు లెనిన్ (అఖిల్ అక్కినేని). సక్రమమైన సంతానం కాదు అని ఎతిరాజు (శివాజీ)ని ముందు నుంచీ కూడా జయంతమ్మ అతడ్ని దూరం పెడుతూనే ఉంటుంది. ఎప్పటికైనా ధర్మరాజు హోదాని దక్కించుకోవాలని ఎతిరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రాఘవరెడ్డికి జయంతమ్మ, వసంత్, లెనిన్ అంటే నచ్చదు. జాతరలో తన కటౌట్‌ని తీసి పారేశారని పగతో రగిలిపోతుంటాడు. ఈ ఊర్లోనే అందరికీ సాయం చేసేందుకు ముందుండేవాడు నీలకంఠం (రాంకీ). అతనికి వైదేహీ, భారతి (భాగ్యశ్రీ) ఇద్దరు కూతుళ్లు. భారతి వల్ల ఆ ఊర్లో జరిగిన రక్తపాతం ఏంటి? అసలు లెనిన్ జైలుకి ఎందుకు వెళ్లాడు? ఎతిరాజు తన చిరకాల వాంఛని నెరవేర్చుకున్నాడా? జైలు నుంచి వచ్చిన లెనిన్ ఏం చేశాడు? ఈ కథలో ఎస్సై పార్థసారథి (సునీల్), దామోదరం (బ్రహ్మాజీ), మురళీ (గెటప్ శ్రీను) పాత్రలు ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. లెనిన్ కథ కొత్తగా అనిపించకపోవచ్చు. ఎక్కడో చూశామే అన్న ఫీలింగ్ చాలా వరకు కనిపించొచ్చు. చాలా చోట్ల దసరా, రాజా ది గ్రేట్, రంగస్థలం ఛాయలు కూడా