
అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు `అఖిల్`. తన పేరుతోనే తొలి సినిమా చేసి ఆకట్టుకున్నాడు. యాక్షన్, కమర్షియల్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అఖిల్‌ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. చివరగా చేసిన `ఏజెంట్` కూడా దారుణంగా డిజప్పాయింట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు `లెనిన్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. `లెనిన్` మూవీలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలని అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆమె బయటకు వచ్చింది. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా వచ్చింది. కొంత షూటింగ్ డిలే కూడా అయ్యింది. ఫైనల్‌గా ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. అఖిల్ కి హిట్ పడే అవకాశం ఉందనే సాంకేతాలను ట్రైలర్ ఇచ్చింది. దీనికితోడు నాగార్జున, నాగవంశీ, అఖిల్ కూడా తమ కాన్ఫిడెంట్‌ని వెల్లడించారు. దీనికితోడు ఈ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. `లెనిన్` మూవీ బాగా వచ్చిందని, ఈ సారి వస్తున్నాం, కొడుతున్నామని నాగార్జున తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే మూవీకి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో మూవీ స్టార్ట్ అవుతుందట. లెనిన్ ఉన్న ఊరు గురించి, లెనిన్ గురించి ఎన్టీఆర్ తన వాయిస్‌తో ఇంట్రో ఇస్తారట. ఆ తర్వాత అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ఉండటం ఇందులో ఆకట్టుకునే అంశమని అంటున్నారు. సినిమా శ్రీరామపురంలో సాగుతుంది. అక్కడ జాతర చుట్టూ సాగే కథ ఇదని అంటున్నారు, అక్కడ ఊరు పెద్ద ఒకరు ఉంటాడు, ఆయన చేసే మిస్టేక్స్ ని ఎదురించే క్రమంలో ఊరి పెద్దకు