లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ
Actor ProfileActor

లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయమేనా
Asianet News Telugu17 Oct 2026
లెనిన్ మూవీ చూడడానికి 5 కారణాలు..పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయమేనా

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్, సితార నాగవంశీతో పాటు అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. భారీ అంచనాలతో అఖిల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఒక్క హిట్ కూడా అందుకోలేదు. లెనిన్ చిత్రంతో అయినా అఖిల్ బోణీ కొడతాడేమో చూడాలి. మరికొన్ని గంటల్లో లెనిన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని చూడడానికి 5 ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. హీరోగా ఎంట్రీ ఇచినప్పటి నుంచి అఖిల్ తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ తో పాటు నాగార్జున, అక్కినేని అభిమానులంతా ఎదురుచూస్తున్నది దాని కోసమే. లెనిన్ మూవీ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో ఉంది. అఖిల్ తొలిసారి తన కెరీర్ లో చిత్తూరు బ్యాక్ డ్రాప్ ఉన్న కథలో నటిస్తున్నారు. చాకొలేట్ బాయ్ లా ఉండే అఖిల్ రాయలసీమ నేపథ్యం ఉన్న కథకి ఎలా సెట్ అవుతాడు అనే ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో అఖిల్ అదరగొట్టేశాడు. ఇక సినిమాలో మెప్పించడమే మిగిలింది. గ్లామర్, పెర్ఫార్మెన్స్ పరంగా భాగ్యశ్రీకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా యువతకు ఆమె క్రష్ గా మారింది. కానీ ఇంత వరకు భాగ్యశ్రీకి సరైన హిట్ దక్కలేదు. లెనిన్ మూవీతో అయినా భాగ్యశ్రీ హిట్ అందుకుంటుందేమో చూడాలి. తన వారసుడి కోసం నాగార్జున మరోసారి నిర్మాతగా మారారు. సితార సంస్థతో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ లెనిన్ మూవీపై ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. గతంలో ఏ సినిమాకీ అఖిల్ ఇంత కాన్ఫిడెంట్ గా కనిపించలేదు. దర్శకుడు నన్ను నమ్మడం వల్లే తన మేకోవర్ మార్చుకోగలిగాను అని అఖిల్ తెలిపారు. పెళ్లయ్యాక అఖిల్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే