లెనిన్ ’ ఫస్ట్ డే కలెక్షన్స్ .. అధికారికంగా ప్రకటించిన టీమ్
Actor ProfileActor

లెనిన్ ’ ఫస్ట్ డే కలెక్షన్స్ .. అధికారికంగా ప్రకటించిన టీమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్ ’ ఫస్ట్ డే కలెక్షన్స్ .. అధికారికంగా ప్రకటించిన టీమ్
Eenadu27 Oct 2026
లెనిన్ ’ ఫస్ట్ డే కలెక్షన్స్ .. అధికారికంగా ప్రకటించిన టీమ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడేళ్ల విరామం తర్వాత ‘లెనిన్‌’తో ప్రేక్షకులను పలకరించారు అక్కినేని అఖిల్‌. మురళీ కిషోర్‌ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా (Lenin) జులై 10న విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.16.7కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ తాజాగా పోస్టర్‌ విడుదల చేసింది (Lenin First Day Collection). రెండో రోజు కూడా టికెట్‌ బుకింగ్స్‌లో జోరు చూపిస్తోందని వెల్లడించింది. అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈసినిమాను నాగార్జున, నాగవంశీ నిర్మించారు. క‌థేంటంటే..: చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరు అది. అక్కడకు లెనిన్ (అఖిల్‌) అనే ఓ అనాథ ఆక‌లితో వ‌స్తాడు. ఆ గ్రామానికి చెందిన పెద్దింటి మ‌హిళ (ఈశ్వ‌రీరావు) చేర‌దీసి అన్నం పెడుతుంది. ఆమె కొడుకు వ‌సంత్ (ప్ర‌మోద్ పంజు), లెనిన్‌ ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. వ‌సంత్ చదువుల కోసం ప‌ట్నం వెళ్ల‌గా, లెనిన్ మాత్రం ఊళ్లోనే ఉంటూ ఆ కుటుంబానికి త‌ల‌లో నాలుక‌లా మెలుగుతుంటాడు. ఊళ్లో 18 రోజులపాటు ఎంతో ప‌విత్రంగా జ‌రిగే భార‌తం మెట్ట ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ని త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపిస్తుంటాడు లెనిన్‌ (Lenin). త‌న‌కు భార‌తి (భాగ్య‌శ్రీ బోర్సే) అంటే ప్రాణం. వైద్యం చ‌దువుకుని ఊరికొచ్చిన వ‌సంత్‌ స్వ‌యంగా లెనిన్‌, భార‌తి వివాహాన్ని జ‌రిపిస్తాడు. ఆ ఊళ్లో ఉత్స‌వాల ఆఖ‌రి రోజు అనూహ్యంగా ఓ సంఘ‌ట‌న జ‌రుగుతుంది. దాంతో భార‌తం మెట్ట ఎంత‌కీ ఆర‌ని అగ్నిగుండంలా ర‌గిలిపోతుంది. లెనిన్ జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ‘లెనిన్‌’ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి.. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా