లైంగిక ఆరోపణల కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
Actor ProfilePolitician

లైంగిక ఆరోపణల కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లైంగిక ఆరోపణల కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
Oneindia Telugu13 Dec 2026
లైంగిక ఆరోపణల కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావును పంజగుట్ట పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఓ 22 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో రేగా కాంతారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెళ్లి పేరుతో నమ్మించి గత నాలుగేళ్లుగా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, నిరాకరిస్తే వేధింపులకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియా ఛానెల్ ఏర్పాటు చేస్తానని నమ్మించి లైంగికంగా వేధించినట్లు తెలిపింది. అంతేకాక తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను రికార్డు చేసి, వాటిని బయటపెడతానంటూ భయభ్రాంతులకు గురిచేసి బ్లాక్‌ మెయిల్ ‌కు పాల్పడ్డారని బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో రూ. 4 లక్షలు కూడా వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద జూలై 26 న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందంతో బెంగళూరు వెళ్లే సాంకేతిక ఆధారాల సహాయంతో ఆయనను అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. అయితే పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవలే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సదరు మహిళ తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఈ మేరకు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు లైంగిక ఆరోపణల కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది