లోక్ అదాలత్ కు జ్ఞానవాపి
Actor ProfileActor

లోక్ అదాలత్ కు జ్ఞానవాపి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లోక్ అదాలత్ కు జ్ఞానవాపి, మథుర.. సుప్రీం’ కీలక నిర్ణయం
Sakshi6 Nov 2026
లోక్ అదాలత్ కు జ్ఞానవాపి, మథుర.. సుప్రీం’ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో వివాదాస్పదంగా మారిన జ్ఞానవాపి మసీదు, మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు, సంభాల్ హరిహర మందిరం-మసీదు కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్‌కు బదిలీ చేసింది. సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాల కంటే చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనేందుకు ఆగస్టు 21 నుంచి 23 వరకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘సమాధాన్ సమారోహ్‌’ పేరిట ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరుపక్షాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. గత ఏప్రిల్ 21 నుంచే కింది కోర్టుల్లో ముందస్తు రాజీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 14న వారణాసిలో జ్ఞానవాపి కేసుపై ముందస్తు విచారణ జరగనుంది. కాగా మథుర వివాదంలో జూలై 5న జరిగిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలం కావడంతో, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ప్రత్యేక లోక్ అదాలత్ పరిధిలోకి తెచ్చింది. మొఘల్ కాలంలో ఆలయాలను కూల్చివేసి ఈ మసీదులను నిర్మించారంటూ హిందూ పక్షాలు కోర్టులను ఆశ్రయించగా, 1991 నాటి ఆరాధనా స్థలాల చట్టం ప్రకారం ఈ పిటిషన్లు చెల్లవని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. గత ఏడాది సంభాల్‌ మసీదు సర్వే ఉద్రిక్తతలకు దారితీసి, పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూడు వివాదాల్లోని చట్టపరమైన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా (ఫొటోలు) వింబుల్డన్‌ విజేత జానిక్‌ సిన్నర్‌ (ఫొటోలు) వింబుల్డన్‌ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్‌చల్‌.. స్పెషల్‌ అట్రాక్షన్‌ వైభవ్‌ సూర్యవంశీ (ఫొటోలు) ఘనంగా ముగిసిన టీజీ20 లీగ్‌... విజేతగా హైదరాబాద్‌ (ఫొటోలు) అమ్మను బూతులు తిడుతున్నారు..! దేవుడు కొంచెం కూడా సిగ్గు పెట్టలేదా ఇరాన్ భీకర దాడులు.. పరుగులు తీస్తున్న జనం.. జగన్ కు అధికారం.. నీకు జైలు.. గెట్ రెడీ చంద్రబాబు...! మేము తలుచుకుంటే ఈపాటికి మీ ఇద్దరూ ఊసలు లెక్కపెట్టేవాళ్లు