లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? టాక్సిక్ హవాలో యశ్ కారు నంబర్ ప్లేట్ వైరల్
Actor ProfileActor

లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? టాక్సిక్ హవాలో యశ్ కారు నంబర్ ప్లేట్ వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? టాక్సిక్ హవాలో యశ్ కారు నంబర్ ప్లేట్ వైరల్
Asianet News Telugu19 Dec 2026
లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? టాక్సిక్ హవాలో యశ్ కారు నంబర్ ప్లేట్ వైరల్

యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాటలు, ట్రైలర్లు ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆగస్టు 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది సినిమా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విదేశాల్లో 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. యశ్ గత చిత్రాల విజయం తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో యశ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రలో తమ హీరోను చూసి మురిసిపోతున్నారు అభిమానులు. 'టాక్సిక్' సినిమా ముహూర్తం రోజు యశ్ ఓ స్పెషల్ కారులోనే వచ్చారు. గతేడాది జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి. యశ్ వాడేది బ్లాక్ రేంజ్ రోవర్. దీని నంబర్ KA 01 NA 8055. బెంగళూరు సెంట్రల్ ఆర్టీఓలో రిజిస్టర్ అయింది. 8055 అంకెలు 'BOSS' లా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. 2023 జనవరిలో కొన్న ఈ కారు ధర సుమారు 5 కోట్లు అని సమాచారం. యశ్‌కు ఎన్ని కార్లున్నా, RX 100 బైక్ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ చదువుపై శ్రద్ధ తగ్గుతోందని ఆ బైక్‌ను వాళ్ల నాన్న అమ్మేశారట. యశ్ కొన్న మొదటి కారు మహీంద్రా స్కార్పియో. దాని ధర అప్పట్లో 9 నుంచి 16 లక్షల మధ్య ఉండేది. నార్త్ అమెరికాలో 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 38 వేల డాలర్లు దాటాయి. అక్కడ ఆగస్టు 25నే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అంటే, ఇండియా కంటే ముందే విదేశీ అభిమానులు సినిమా చూడబోతున్నారన్నమాట