రష్యా నుంచి భారత్ కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్
Actor ProfileCelebrity

రష్యా నుంచి భారత్ కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రష్యా నుంచి భారత్ కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్
Oneindia Telugu22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్

భారత్-రష్యాల మధ్య సంబధాలకు శతాబ్దాలుగా చారిత్రక నేపథ్యం ఉంది. వాణిజ్యం నుంచి వ్యూహాత్మక సంబంధాల వరకు ఈ రెండు దేశాల మధ్య సుసంపన్నమైన చరిత్ర ఉంది. కేవలం రక్షణ, ఇందన రంగాలకే పరిమితం కాకుండా వాణిజ్య బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు మాస్కో ఓ సంచలన ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. రష్యా నుంచి నేరుకగా హిందూ మహాసముద్రం వరకు రైల్వే మార్గాన్ని నిర్మించడం ద్వారా ఇండియాతో భూమార్గ అనుసంధానాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని రష్యా ఉప ప్రధాని మారత్ ఖుస్నుల్లిన్ ప్రభుత్వ వార్తా సంస్థ టాస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. హిందూ మహాసముద్రానికి రైల్వే మార్గాన్ని నిర్మించడాన్ని రష్యా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ప్రత్యామ్నాయ రైలు నెట్‌వర్క్, ప్రస్తుతం ఉన్న సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని రష్యా విశ్వసిస్తోంది.1947లో భారత్‌లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్‌పోర్ట్‌తో అరబ్ ప్రజలు...ప్రస్తుతం రష్యా, భారత్ మధ్య అత్యధిక వాణిజ్యం బోస్పరస్, హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు, గ్యాస్ వాణిజ్య మార్గాలలో ఒకటి. అయితే ప్రపంచ చమురు రవాణాలో 25 శాతం, ఎల్ఎన్జీ(ద్రవీకృత సహజ వాయువు) రవాణాలో 20 శాతం ఈ సముద్ర మార్గం గుండానే జరుగుతాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా సముద్రం మార్గం ద్వారా వెళ్లే వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా తన వాణిజ్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.ఏఏ దేశాల గుండా ఈ రైలు మార్గం వెళ్తుంది? ప్రతిపాదిత రైల్వే నెట్వర్క్ రష్యా నుంచి బయలుదేరి మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలైన తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల గుండా హిందూ మహాసముద్రాన్ని చేరుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఇండియాకు రవాణా అయ్యే సరుకుల సమయం, వ్యయం గణనీయంగా తగ్గుతాయి