రష్మిక కామెంట్ నా వ్యక్తిత్వాన్ని మార్చదు
Actor ProfileActor

రష్మిక కామెంట్ నా వ్యక్తిత్వాన్ని మార్చదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రష్మిక కామెంట్ నా వ్యక్తిత్వాన్ని మార్చదు
Eenadu29 Dec 2026
రష్మిక కామెంట్ నా వ్యక్తిత్వాన్ని మార్చదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి రష్మిక (Rashmika Mandanna) గతంలో తనపై చేసిన ఓ కామెంట్‌పై పాన్‌ ఇండియా స్టార్‌ యశ్‌ (Yash) స్పందించారు. 2017లో ఓ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి ‘మిస్టర్ షో ఆఫ్’ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై యశ్‌ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్లు 3-4 ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోమంటారు. ఆ ఆప్షన్లలో నాకు ఇది సరిపోతుందని రష్మిక భావించి ఉండొచ్చు. నేను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది. అయినా, ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ నిర్ణయించలేదు. ఇతరుల దృష్టికోణాన్ని బట్టి నా క్యారెక్టర్ మారదు’’ అని యశ్ స్పష్టం చేశారు. అలాగే తన అభిమానులను ఉద్దేశించి.. ‘‘సహ నటీనటులను గౌరవించని వారు నా అభిమానులు కారు’’ అని చెప్పారు. ఇక, రష్మిక వ్యాఖ్యలపై అప్పట్లో యశ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడంతో.. ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యశ్ ‘టాక్సిక్’ (Toxic) సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలకు యశ్ బదులిస్తూ.. ‘‘నేను అశ్లీలతను ప్రోత్సహించను. ఇది ఇప్పటి యువత కోసం తీసిన సినిమా’’ అని వివరణ ఇచ్చారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రామాయణ’ (Ramayana)లో యశ్ రావణుడిగా నటిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల