రవితేజ ఇరుముడి’ సెన్సార్ పూర్తి
Actor ProfileCelebrity

రవితేజ ఇరుముడి’ సెన్సార్ పూర్తి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రవితేజ ఇరుముడి’ సెన్సార్ పూర్తి
TeluguOne8 Jan 2027
రవితేజ ఇరుముడి’ సెన్సార్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి'. తండ్రి-కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప మాల ధారణ, క్రైమ్ సస్పెన్స్ కథాంశంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజ, ఫీల్ గుడ్ ఎమోషనల్ కథలను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇరుముడి'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకి గ్రాండ్‌గా సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ని చూస్తే, 2 గంటల 25 నిమిషాలుగా లాక్ చేశారు. కథా కథనాల పరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా, సీన్ టు సీన్ పక్కా గ్రిప్పింగ్‌గా నడిచేలా శివ నిర్వాణ పర్‌ఫెక్ట్ రన్‌టైమ్‌ని డిజైన్ చేశారు. రవితేజ అనగానే మనకి మొదట గుర్తొచ్చేది మాస్ యాక్షన్. కానీ ఈ సినిమాలో రవితేజను ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. కథలో తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ గుండెలను పిండేసేలా ఉంటుందట. మద్యం అలవాటు ఉన్న ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్, తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఈ కథలోని ప్రధానాంశం. అంతేకాదు, ఈ ఫ్యామిలీ డ్రామాకి తోడు గ్రామీణ నేపథ్యం ఆధారంగా సాగే ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్ ప్రేక్షకులకు షాకింగ్ ట్విస్టులు ఇవ్వబోతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద