రవితేజ ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా
Actor ProfileActor

రవితేజ ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రవితేజ ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా
Samayam Telugu24 Jan 2027
రవితేజ ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా

మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'ఇరుముడి'. భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ అంశాల మేళవింపుతో వచ్చిన ఈ సినిమాపై తొలి నుంచే పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజను సరికొత్త ఆధ్యాత్మిక, కుటుంబ నేపథ్యంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే విదేశీ ప్రీమియర్లను పూర్తి చేసుకుని పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది.ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. మద్యం వ్యసనానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకునే ఒక సాధారణ గ్రామీణ తండ్రి చుట్టూ తిరుగుతుంది. తన కన్నకూతురి ప్రేమ, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం అతడు పవిత్రమైన 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షను చేపడతాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి, అమాయకపు ఆడపిల్లలకు ఎదురయ్యే ఊహించని ప్రమాదం నుంచి దీక్షా నియమాలను పాటిస్తూనే అతడు తన కుటుంబాన్ని, ఊరిని ఎలా కాపాడాడనే అంశాన్ని దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఆకట్టుకునే తండ్రీ కూతుళ్ల బంధంయూఎస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ స్పందనను పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో నిజాయితీగా, మలయాళ చిత్రాల తరహా సహజత్వంతో సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, పాఠశాల నేపథ్యంలో మొదలయ్యే సన్నివేశాలు, కథలోని అంతర్లీన ఉత్కంఠ ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించాయి. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినప్పటికీ, ఇంటర్వెల్ సమయానికి వచ్చే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులుఇక సెకండాఫ్‌లో కథలోని ఎమోషన్స్ పీక్స్‌కి చేరుకుంటాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఊహించని ట్విస్టులు, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'మల్లెపూల పల్లకి' భక్తి గీతం నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తూ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసిస్తున్నారు. ట్విస్ట్