రన్’ విజయ్ చేయాల్సిన సినిమా .. కానీ
Actor ProfileActor

రన్’ విజయ్ చేయాల్సిన సినిమా .. కానీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రన్’ విజయ్ చేయాల్సిన సినిమా .. కానీ
Chitrajyothy27 Sept 2026
రన్’ విజయ్ చేయాల్సిన సినిమా .. కానీ

ప్రముఖ దర్శకుడు లింగుసామి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘రన్’ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాను మొదటగా ఇలయదళపతి విజయ్ హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించాలని అనుకున్నారట. ప్రముఖ దర్శకుడు లింగుసామి (Lingusamy) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘రన్’ (Run Movie) గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాను మొదటగా ఇలయదళపతి విజయ్ (Ilayathalapathy Vijay) హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించాలని అనుకున్నారట. ఈ మేరకు కథను పూర్తి చేసిన లింగుసామి.. విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్‌ (SA Chandrasekhar) కు కథను వినిపించారు. ఎస్.ఏ. చంద్రశేఖర్‌ తీసుకున్న నిర్ణయంతో.. ఈ సినిమా విజయ్ చేయలేదని, లేదంటే అది ఇలయదళపతి చేయాల్సిన సినిమా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో లింగుసామి మాట్లాడుతూ.. కథ విన్న తర్వాత ఎస్.ఏ. చంద్రశేఖర్ ఇది ఒక అద్భుతమైన యాక్షన్ లవ్ స్టోరీ అని మెచ్చుకున్నారు. అయితే, ఆ సమయంలో విజయ్ అప్పటికే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘తమిళన్’ సినిమాలో నటిస్తున్నారు. 'తమిళన్' సినిమా స్కేల్‌తో పోలిస్తే ‘రన్’ కథ కాస్త చిన్నదిగా అనిపించవచ్చని, అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో విజయ్‌తో చేయాల్సిన ఆ సినిమా అక్కడితో ఆగిపోయిందని పేర్కొన్నారు. ఎస్.ఏ. చంద్రశేఖర్‌ నిర్ణయంతో ఈ ప్రాజెక్ట్ విజయ్‌ని కాదని.. మాధవన్ వద్దకు వెళ్ళడం, ‘రన్‌’ వచ్చి ఎటువంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. మరోవైపు విజయ్ కూడా ఆ తర్వాత తెలుగు బ్లాక్‌బస్టర్ ‘ఒక్కడు’ రీమేక్‌లో నటించారు. అదే ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘గిల్లి’ సినిమాగా మారి.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఒకవేళ ‘రన్’ సినిమా విజయ్ చేసి