రన్నింగ్ బస్సు నుంచి ఊడిపోయిన బస్సు టైర్లు.. 30 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం.. వీడియో
Actor ProfilePolitician

రన్నింగ్ బస్సు నుంచి ఊడిపోయిన బస్సు టైర్లు.. 30 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం.. వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రన్నింగ్ బస్సు నుంచి ఊడిపోయిన బస్సు టైర్లు.. 30 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం.. వీడియో
Zee Telugu26 Sept 2026
రన్నింగ్ బస్సు నుంచి ఊడిపోయిన బస్సు టైర్లు.. 30 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం.. వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pulivendula School bus accident: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుకున్నాయి. ఈ క్రమంలో కొంత మంది ప్రభుత్వ పాఠశాలలోవైపు ఆసక్తి చూపిస్తే, మరికొంత మంది తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లల్ని చేర్పించారు. నార్మల్ గా కొన్ని ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రల నుంచి లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తు విద్యార్థులకు అందించాల్సిన వసతుల్లో మాత్రం నెగ్లీజెన్సీగా ప్రవర్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఎక్కువగా ఫిట్ నెస్ లేని బస్సులు, సరిగ్గా బస్సులు నడపక రాకున్న వ్యక్తుల్ని స్కూల్ బస్సుల డ్రైవర్ లుగా కొన్ని స్కూళ్లు నియమించుకుంటున్నాయి. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఏపీలోని పులివెందులలో ఒక ప్రైవేటు స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ కొంచెం అప్రమత్తంగా ఉండటంతో విద్యార్థులు పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాడు. కడప జిల్లా పులివెందులలో సోమవారం ఒక స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో రోడ్డు సరిగ్గా లేక పొవడంతో బస్సు వెనుక టైర్లు రెండు ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. కానీ డ్రైవర్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించడంతో రోడ్డుపక్కల బస్సును సడెన్ బ్రేక్ వేసి మరీ ఆపాడు. అప్పటికే బస్సులో ఉన్న విద్యార్థులుగట్టిగా కేకలు పెట్టారు. బస్సు ఆగడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. Read more: CM Chandrababu naidu: 116 ఏళ్ల వయసులో మెట్ల మార్గంలో తిరుమలకు బామ్మ.. ఏపీ సీఎం