
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Maya Tata in Tata Group: టాటా గ్రూప్‌లో క్రమంగా ఒక కొత్త తరం నాయకత్వం ఆవిర్భవిస్తోంది. ఈ నేపథ్యంలో, రతన్ టాటా తమ్ముడు నోయల్ టాటా చిన్న కుమార్తె అయిన 37ఏళ్ల మాయా టాటాకు ట్రెంట్ లిమిటెడ్ వారి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ వెస్ట్‌సైడ్ లో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆమె ఆన్‌లైన్ వ్యాపారం, అంతర్జాతీయ ఈ-కామర్స్ విస్తరణను పర్యవేక్షించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్న నోయల్ టాటా ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ మార్పు చాలా ముఖ్యమైనదిగా మారింది. అయితే, మాయా టాటా నియామకంపై ట్రెంట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఎవరీ మాయా టాటా: 1989లో ముంబైలో జన్మించిన మాయా టాటా, యూకేలోని వార్విక్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తర్వాత లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. టాటా డిజిటల్‌లో చేరకముందు, ఆమె టాటా క్యాపిటల్ వారి టాటా ఆపర్చునిటీస్ ఫండ్ లో పనిచేశారు. నోయెల్ టాటా ముగ్గురు పిల్లలు టాటా సన్స్ టాటా ట్రస్ట్స్‌లో మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. వారు వివిధ అనుబంధ.. చిన్న ట్రస్టుల బోర్డులలో సభ్యులుగా ఉన్నారు. నెవిల్ సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో కూడా సభ్యుడిగా ఉన్నారు. నివేదికల ప్రకారం.. ఇటీవల కంపెనీ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన నోయెల్ టాటా, టాటా డిజిటల్‌పై దృష్టి సారిస్తున్న తరుణంలో మాయా టాటా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితులలో.. ఆయన తన