
జగ్గారెడ్డి వంటి నాయకుడిని డబ్బుతో కొనలేమని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రూ.వెయ్యి కోట్లు ఇచ్చినా అలాంటి నేత దొరకరని అన్నారు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తిగా జగ్గారెడ్డిని అభివర్ణించారు. నాయకులకు మార్కులు వేయాల్సి వస్తే తనకంటే జగ్గారెడ్డికే ఎక్కువ మార్కులు వస్తాయని సీఎం అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన చూపిస్తున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. జగ్గారెడ్డి ప్రజాజీవితంలో కొనసాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సభలో జగ్గారెడ్డి గురించి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాముడితో పోల్చిన సీఎం.. జగ్గారెడ్డి హనుమంతుడిలాంటి నాయకుడని అన్నారు. రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయాలను జగ్గారెడ్డి గౌరవిస్తారని, పార్టీ నాయకత్వం సూచించిన మార్గంలోనే ఆయన ముందుకు సాగుతారని చెప్పారు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాన్ని రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. జగ్గారెడ్డికి రాజకీయ భవిష్యత్తు విషయంలో పార్టీ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులతో పాటు సంగారెడ్డి ప్రజలపై ఉందని అన్నారు. జగ్గారెడ్డితో తనకు సుమారు 30 ఏళ్లుగా స్నేహ సంబంధం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. జగ్గారెడ్డి రాజకీయంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానానిదేనని చెప్పారు. జగ్గారెడ్డి ఇకపై రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేయకూడదన్నట్టుగా సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా జీవితాన్ని కొనసాగించాలని కోరారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా జగ్గారెడ్డి గుర్తింపు పొందారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుపై బీఆర్‌ఎస్, బీజేపీలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు వైపుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గతంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతు సంక్షేమం విషయంలోనూ