రాష్ట్రంలో లిథియం
Actor ProfilePolitician

రాష్ట్రంలో లిథియం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాష్ట్రంలో లిథియం, గాలియం ఖనిజాల అన్వేషణ
Andhra Jyothy12 Dec 2026
రాష్ట్రంలో లిథియం, గాలియం ఖనిజాల అన్వేషణ

ఎన్‌జీఆర్‌ఐతో గనుల శాఖ ఒప్పందం సీఎంతో అదానీ గ్రూప్‌ ప్రతినిధుల భేటీ అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కడప బెసిన్‌లో కీలక ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్-నేషనల్ జియాలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)తో రాష్ట్ర గనుల శాఖ ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో గనులశాఖ, ఎన్‌జీఆర్ఐ ప్రతినిధులు ఒప్పందపత్రాలపై బుధవారం సంతకాలు చేశారు. కడప జిల్లా తుమ్మలపల్లె పరిసర ప్రాంతాల్లో ఎన్‌జీఆర్ఐ నిర్వహించిన ప్రాథమిక పరిశోధనల్లో లిథియం, గాలియం ఖనిజాల ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. మరింత అధ్యయనం చేస్తే ఖనిజ ఆనవాళ్లపై ఇంకా ఎక్కువ స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గనుల రంగంలో పరిశోధన, సాంకేతిక, వనరుల వినియోగం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు ధన్‌బాద్‌లోని ఐఐటీ (ఐఎస్ఎం)తో కూడా ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలె‌న్స్‌ను ధన్‌బాద్‌ ఐఐటీ ఏర్పాటు చేయనుంది. సీఎంతో అదానీ గ్రూప్ ప్రతినిధుల భేటీ అదానీ పోర్టులు, సెజ్ లిమిటెడ్ ఎండీ కిరణ్ అదానీ నేతృత్వంలో అదానీ గ్రూప్ ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆదానీ గ్రూప్‌లోని కంపెనీలే ఉత్తరాంధ్రలోని గార, భీమిలీ బీచ్ శాండ్ కాంట్రాక్టు దక్కించుకున్నాయి. ఒప్పందం నిబంధనలకు విరుద్ధమని పలువురు హైకోర్టులో కేసులు వేశారు. తదుపరి విచారణ అక్టోబరులో జరగనుంది. ఈ నేపథ్యంలో అదానీ ప్రతినిధులు సీఎంను కలిసి బీచ్‌శాండ్ ప్రాజెక్టు ఒప్పందం, లీగల్ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.. వార్తలు కూడా చదవండి... చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం Read Latest AP News And Telangana News And National News And Telugu News వార్తలు కూడా చదవండి... చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం