.webp)
ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారం వైసీపీ తీరు రోజుకో రకంగా మారుతోంది. ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ ఎప్పుడు ఏం మాట్లాడుతోంది, ఏ క్షణంలో ఏ ప్రకటన చేస్తుందన్న విషయం ఆ పార్టీకైనా తెలుసా? అన్న అనుమానాలు పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి. ప్రశ్న రావణ్ కేసుపై స్పందించిన అంబటి రాంబాబు.. రావణుడే గెలుస్తాడు.. మేము గెలిపిస్తాం అంటూ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్తవానికి గత కొద్దిరోజులుగా ప్రశ్న రావణ్ ఎపిసోడ్‌లో వైసిపి సోషల్ మీడియా తీవ్ర అయోమయంలో పడినట్లు కనిపించింది. ఒక దశలో ప్రశ్న రావణ్ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పాత వీడియోలను షేర్ చేస్తూ, అతను టిడిపి సానుభూతిపరుడంటూ వైసిపి ప్రచారం చేసింది. ఇప్పుడు.. ఇప్పుడు మాట మార్చి ప్రశ్న రావణ్ ను వెనకేసుకొస్తూ వైసీపీ అగ్రనేతలు మాట్లాడుతున్నారు. ఒకరోజు టిడిపి మనిషి అని ముద్ర వేసి, ఆ మరుసటి రోజే అతనికి పూర్తి స్థాయిలో అండగా నిలబడటం విస్మయ పరుస్తోంది. పైగా మాజీ మంత్రి అంబటి ఒక అడుగు ముందుకు వేసి.. రావణుడిని గెలిపిస్తామనడం వివాదాస్పదంగా మారింది. ప్రశ్న రావణ్ భావజాలానికీ, వైసీపీ సిద్ధాంతాలకూ సంబంధం లేదన్న అంబటి.. అతని మీద అన్యాయంగా కేసులు పెట్టి సోషల్ మీడియా గొంతు నొక్కాలని,చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ యుద్ధంలో రావణుడే గెలుస్తాడు.. రావణుడిని మేము గెలిపిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత వారం ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. సమాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు