రావణ్ అరెస్టు
Actor ProfilePolitician

రావణ్ అరెస్టు

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources3
రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలనం
Telugu Times10 Oct 2026
రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలనం

సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్(Prashna Ravan) అరెస్టు ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రావణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ వస్తున్న ప్రచారాన్ని కొడాలి నాని పూర్తిగా ఖండించారు. “రావణ్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తి. ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తుంటారు. అందుకే ఆయన ఎప్పుడూ టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. టీడీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్, ఎల్లో మీడియా మాత్రమే అసత్య కథనాలతో రావణ్‌ను వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నాయి” అని నాని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై రావణ్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ, తామెప్పుడూ ఆయనపై అణచివేత చర్యలకు పాల్పడలేదని కొడాలి నాని గుర్తు చేశారు. “అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గానీ, మా పార్టీ నేతలు గానీ రావణ్ విమర్శలను భరించామే తప్ప.. ఆయనపై అక్రమ కేసులు పెట్టలేదు. జనసేన పార్టీలాగా పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి దాడులకు ప్రయత్నించలేదు” అని మండిపడ్డారు. గత ఏడాది కాలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని రావణ్ మాట్లాడటమే ప్రస్తుత ఆయన అరెస్టుకు అసలు కారణమని కొడాలి నాని విశ్లేషించారు. జనసేన పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ రావణ్‌పై వరుస కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పిందని ఆరోపించారు. కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ ఇవ్వడంతో, తట్టుకోలేక ప్రభుత్వం కొత్త చట్టాలను అడ్డం పెట్టుకుని ఇడ్లీ, ఉప్మా అంటూ అక్రమంగా జైల్లో పెడుతోందని విమర్శించారు

రావణ్ వ్యవహారం వెనుక.. కొడాలి నాని సంచలనం
Oneindia Telugu9 Oct 2026
రావణ్ వ్యవహారం వెనుక.. కొడాలి నాని సంచలనం

మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ అరెస్టు ఉదంతంపై స్పందించారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని

ప్రకాష్ రాజ్ పై నిర్మాత బండ్ల గణేష్ ఫైర్
SkyC Media27 Sept 2026
ప్రకాష్ రాజ్ పై నిర్మాత బండ్ల గణేష్ ఫైర్

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అరెస్టును తప్పుపడుతూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్

అరెస్టు-బెయిల్ మధ్య రావణ్..! తగ్గని పోలీసులు-మధ్యలో జనసేన
Oneindia Telugu14 Sept 2026
అరెస్టు-బెయిల్ మధ్య రావణ్..! తగ్గని పోలీసులు-మధ్యలో జనసేన

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అరెస్టు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna ravan) కు వరుసగా కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నాయి. అయినా పోలీసులు తిరిగి అరెస్టు

నవ్వుతు నవ్వుతూనే మంటపెట్టిన ప్రకాష్ రాజ్.. సెగ ఏపీలో ఎవరికి తగలాలో వారికి
Oneindia Telugu8 Sept 2026
నవ్వుతు నవ్వుతూనే మంటపెట్టిన ప్రకాష్ రాజ్.. సెగ ఏపీలో ఎవరికి తగలాలో వారికి

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, అరెస్టుల వ్యవహారాలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్న రావణ్ అరెస్టు ఉదంతంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు