రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి
Actor ProfilePolitician

రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి
Sakshi2 Dec 2026
రేవంత్ సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. సీఎం సోదరులు ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘సీఎం సోదరుల వ్యవహరశైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో సీఎం రేవంత్‌ సోదరులకు ప్రత్యేక రూల్స్‌ ఎందుకు?. సీఎం రేవంత్‌రెడ్డి దోపిడీని ప్రజలకు వివరిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. చదువు రాని రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లుతో కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ లేరు.. ఆ కంపెనీకి వేల కోట్ల భూములు కేటాయింపు. 200 కోట్ల విలువ చేసే స్థలాన్ని 7 వేల కోట్లకి కేటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆ కంపెనీకి కొండల్ రెడ్డికి సంబంధం లేదని ఎలా చెబుతారు? ..మీ శాఖలో ఏం జరుగుతుందో శ్రీధర్ బాబుకి తెలియదా? లేక సీఎం ఒత్తిడికి తలొగ్గరా? కొండల్ రెడ్డికి సంబంధం లేకుంటే యూఎస్‌ కౌన్సిల్ మీటింగ్‌కి ఎలా వెళ్ళారు. ఈ భూ కేటాయింపులను వదలం. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం. 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనేది ఆందోళనకరం. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అర్హుల ఓట్లు కోల్పోకుండా చూస్తాం. తెలంగాణణకి అన్యాయం చేసే జీఆర్‌ఎంబీ మీటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా? లేదా స్పష్టం చేయాలి. జలసౌధాలో జరిగే జీఆర్‌ఎంబీ ఎజెండా మార్చుకుంటే జలసౌధను ముట్టడిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర చెప్పినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదు’’ అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో మెరిసిన నటి