
Zee Telugu•7 Nov 2026
రేవంత్ వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి కంటతడిTelangana News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. Zee Telugu News తో మాట్లాడిన ఆయన.. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా లేఖలు రాశామని.. కానీ తమను ఎప్పుడూ బెదిరించలేదని అన్నారు. తమను పిలిచి చర్చించి, తాము సమర్పించిన నివేదికను పరిశీలించాలని అధికారులను ఆదేశించేవారని గుర్తు చేశారు. ఇంత నిస్వార్థంగా సేవ చేసిన తమను ఇప్పుడు జైలులో పెడతానని బెదిరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు