రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం
Actor ProfilePolitician

రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం, పాపం... వంటింట్లో ఎలా కష్టపడుతున్నాడో చూడండి
Asianet News Telugu17 Oct 2026
రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం, పాపం... వంటింట్లో ఎలా కష్టపడుతున్నాడో చూడండి

వీడియోలో రేవంత్ రెడ్డి వంటగదిలో పూరీలు తయారు చేస్తూ కనిపించారు. ఆయన పక్కనే వంటగది కౌంటర్‌పై కూర్చున్న మనవడు ఆసక్తిగా తాత చేస్తున్న పనిని గమనిస్తూ మాట్లాడుతున్నాడు. ఇద్దరి మధ్య జరిగిన ఆ సరదా సంభాషణ వీడియోకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ముందుగా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని గుండ్రంగా ఒత్తారు. తర్వాత వేడి నూనెలో ఒక్కో పూరీని వేస్తే అవి చక్కగా పొంగి రావడం వీడియోలో కనిపించింది. మనవడితో మాట్లాడుతూనే ఎంతో ప్రశాంతంగా పూరీలు చేస్తూ రేవంత్ రెడ్డి కనిపించారు. సాధారణంగా ప్రజా కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కనిపించే ముఖ్యమంత్రి ఈసారి కుటుంబ సభ్యుడిగా కనిపించడం చాలామందిని ఆకట్టుకుంది. రాజకీయ నాయకుడిగా కాకుండా తాతగా మనవడితో గడిపిన ఈ క్షణాలు వీడియోను ప్రత్యేకంగా నిలిపాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. "రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు", "పదవిలో ఉన్నా కుటుంబంతో ఇంత ఆప్యాయంగా గడపడం ఎంతో ఆనందంగా ఉంది", "ఇలాంటి వ్యక్తిగత క్షణాలు చూడటం చాలా సంతోషంగా ఉంది" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనవడి కోసం ప్రేమగా పూరీలు చేస్తూ, అతనితో నవ్వుతూ మాట్లాడిన రేవంత్ రెడ్డి వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోన్న ఈ వీడియోకు మంచి స్పంద‌న వ‌స్తోంది