
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish slams on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య కన్నెపల్లిపంప్ హౌస్, మేడిగడ్డ గేట్లు తెరవడం అంశంపై వివాదం పీక్స్ కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, కేటీఆర్ లు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిచేసిన వ్యాఖ్యలకు మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతులకు మంచి నీళ్లు ఇవ్వాలంటే రేవంత్ తమ రక్తంను పొలాల్లో చల్లాలని అంటున్నారని అన్నారు. ఒక వేళ రైతులకు నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి మా రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని అయినా ఇవ్వడానికి మేము సిద్ధమని హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రక్తపిపాసి మనస్తత్వానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. పాపం పండిన నాడు హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. రేవంత్ రెడ్డి 31 నెలల్లో బూతులు తప్ప విషయం నేర్చుకోలేదన్నారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఎలా ఆన్ చేస్తారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చన్న కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి సోయి రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. అంతే కాకుండా.. ఉన్న విషయం బైటపెడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో వేస్తా అని రేవంత్ రెడ్డి అంటుండని విమర్శలు