
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక విదేశీ పర్యటన వేదికగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరోసారి తీవ్ర రాజకీయ ఘర్షణ రాజుకుంది. లండన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి టూర్‌కు కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అనుమతి నిరాకరించింది. విదేశీ పర్యటనకు క్లియరెన్స్ నిరాకరిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా పెను రాజకీయ చర్చకు దారితీసింది. కేంద్ర నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని, ఆగస్టు 23న లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ రేవంత్ విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో పలువురు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతులు నిరాకరించినప్పుడు ప్రోటోకాల్ లేదా విధివిధానాల కారణాలు చెప్పేవారు. కానీ, రేవంత్ రెడ్డి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి విపక్ష నేతలపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడుతుండటం, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆయన అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే కేంద్రం ఈ అడ్డంకులు సృష్టించిందన్న వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి ఊహించని షాక్ తగిలినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అత్యంత పరిణతితో కూడిన రాజకీయ, పరిపాలనా వ్యూహాన్ని అమలు చేశారు. తన పర్యటన రద్దయినా, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉన్నతాధికారుల బృందాన్ని యథావిధిగా అమెరికా పర్యటనకు పంపాలని ఆదేశించారు. హార్వర్డ్, ఎంఐటీ, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో ఇప్పటికే ప్రతిపాదించిన ఒప్పందాలను అధికారులు పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. తద్వారా కేంద్రం అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ఆపలేరనే బలమైన సంకేతాన్ని ఆయన ప్రజల్లోకి పంపారు. కేంద్రం వైఖరిపై రేవంత్ రెడ్డి తీవ్ర