రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో ఫిక్స్ చేసేసిన హీరో
Actor ProfileActor

రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో ఫిక్స్ చేసేసిన హీరో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో ఫిక్స్ చేసేసిన హీరో
10TV Telugu23 Nov 2026
రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో ఫిక్స్ చేసేసిన హీరో

Nikhil Siddhartha : నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోవడంతో వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాడు. త్వరలో స్వయంభు సినిమాతో రాబోతున్నాడు నిఖిల్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ నిర్మాతలుగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సంయుక్త, నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజుల కాలం కథతో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా, తిరుపతి దగ్గర జరిగిన ఓ రాజుల కాలం సంఘటన ఆధారంగా ఈ స్వయంభు సినిమా తీస్తున్నట్టు నిఖిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇందులో సంయుక్త కూడా యుద్దాలు చేయబోతుంది. ఈ సినిమా ప్రస్తతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. Also See : Nandamuri Deepika : బోనాలు పండగలో సందడి చేసిన ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపిక ఫొటోలు.. అయితే ఇంకా స్వయంభు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ మాత్రం ఫిక్స్ చేసేసాడు. నిఖిల్ ఇటీవల తను ఇంటర్వ్యూ ఇచ్చిన ఓ వీడియో బైట్ ని షేర్ చేయగా.. ఓ అభిమాని సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో పెట్టండి, వేంకటేశ్వరస్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయని కామెంట్ చేసాడు. దీంతో నిఖిల్ రిప్లై ఇస్తూ.. అక్కడికి కచ్చితంగా వస్తాము అని కామెంట్ చేసాడు. దీంతో నిఖిల్ స్వయంభు సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం తిరుపతిలో ఉండబోతుందని తెలుస్తుంది