రాముడి విరాళాల స్కాంలో కీలక పరిణామం
Actor ProfilePolitician

రాముడి విరాళాల స్కాంలో కీలక పరిణామం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాముడి విరాళాల స్కాంలో కీలక పరిణామం
Sakshi28 Sept 2026
రాముడి విరాళాల స్కాంలో కీలక పరిణామం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించింది. అలాగే, ఆయన స్థానంలో భజరంగ్‌ లాల్‌ బాగ్రాను నియమించింది. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే సిట్‌ నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. పవిత్ర క్షేత్రానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం నాటి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజ్రంగ్ బగ్రాను కొత్త సెక్రటరీగా నియమించింది. ఎవరీ భజ్‌రంగ్ బాగ్రా? రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు బగ్రా ప్రస్తుతం VHP అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు కార్పొరేట్ నిర్వహణతో పాటు వీహెచ్‌పీ సంస్థాగత నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన దశాబ్దాల అనుభవం ఉంది. అయోధ్యలో జరిగిన సంస్థ 'ప్రన్యాసి మండలి' (ట్రస్టీల మండలి), నిర్వహణ కమిటీ సమావేశంలో ఎన్నికైన తర్వాత, ఫిబ్రవరి 2024 నుండి ఆయన ఈ పదవిని నిర్వహిస్తున్నారు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన బాగ్రా, పూర్తిస్థాయి సంస్థాగత బాధ్యతలు చేపట్టడానికి ముందు, ఆయన ప్రభుత్వ రంగంలో విశిష్టమైన వృత్తిపరమైన అనుభవాన్నికూడా గడించారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'నవరత్న' ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO)కు సీఎండీగా పనిచేశారు. అంతకుముందు, NALCO, RITES లిమిటెడ్‌లలో డైరెక్టర్ (ఫైనాన్స్) మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) వంటి పదవులను కూడా నిర్వహించి, ఆర్థిక నిర్వహణ మరియు కార్పొరేట్ పాలనలో విస్తృత అనుభవాన్ని గడించారు. ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్‌ చేసిన నెటిజన్‌పై గాయని