రూపాయి తీసుకోకుండా కన్నెపల్లి పంపులను నడిపిస్తాం
Actor ProfilePolitician

రూపాయి తీసుకోకుండా కన్నెపల్లి పంపులను నడిపిస్తాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రూపాయి తీసుకోకుండా కన్నెపల్లి పంపులను నడిపిస్తాం
Samayam Telugu19 Oct 2026
రూపాయి తీసుకోకుండా కన్నెపల్లి పంపులను నడిపిస్తాం

Telangana Retired Engineers Association TREA : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల పునరుద్ధరణపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్ (టీఆర్ఈఏ) కీలక ప్రకటన చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) నివేదికలు, సిఫార్సులను సాకుగా చూపుతూ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నడపడం సాధ్యం కాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను నిపుణులు కొట్టిపారేశారు. సరైన కార్యాచరణ పద్ధతులు, సాంకేతిక పర్యవేక్షణ పాటిస్తే కన్నెపల్లితో పాటు అన్నారం, సుందిళ్ల పంపులను సురక్షితంగా ఆపరేట్ చేయవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ పంపుల నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి రుసుము ఆశించకుండా ఉచితంగా స్వచ్ఛంద సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి, అధ్యక్షుడు ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ తనీరు వెంకటేశం గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.అనుకూలంగా ఉన్న హైడ్రాలిక్ పరిస్థితులు..ప్రాణహిత నదిలో తగినంత వరద ప్రవాహం ఉన్నప్పుడు మేడిగడ్డ నుంచి నీటిని సులభంగా లిఫ్ట్ చేయవచ్చని విశ్రాంత ఇంజినీర్లు విశ్లేషించారు. మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంపింగ్ స్టేషన్‌కు నీటిని సరఫరా చేయడానికి అవసరమైన కనీస నీటి మట్టం 93.5 మీటర్లు కాగా.. ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం 97.5 మీటర్లుగా ఉంది. అంటే హైడ్రాలిక్ పరిస్థితులు పంపింగ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని వారు వివరించారు. ఈ లెక్కింపులప్రకారం కన్నెపల్లి పంపింగ్ స్టేషన్ ద్వారా ప్రతిరోజూ దాదాపు 3 టీఎంసీల నీటిని సురక్షితంగా ఎత్తి పోయవచ్చని నిపుణుల కమిటీ పేర్కొంది.నీటిని ఎగువకు సాఫీగా తరలించాలంటే.. అన్నారం వద్ద 116.5 మీటర్లు, సుందిళ్ల వద్ద 126.5 మీటర్ల కనీస నీటి మట్టాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మట్టాల వద్ద మూడు బారేజీలు సురక్షితమైన కనీస కార్యాచరణ స్థాయిలలో