రేపే 158 టైటిల్ గ్లింప్స్.. కొత్త అవతార్ లో మెగాస్టార్
Actor ProfileActor

రేపే 158 టైటిల్ గ్లింప్స్.. కొత్త అవతార్ లో మెగాస్టార్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేపే 158 టైటిల్ గ్లింప్స్.. కొత్త అవతార్ లో మెగాస్టార్
AP7AM24 Jan 2027
రేపే 158 టైటిల్ గ్లింప్స్.. కొత్త అవతార్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 158వ చిత్రం (#MEGA158) నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. "మెగాస్టార్‌ను సరికొత్త అవతార్‌లో, కొత్త యాటిట్యూడ్‌తో చూపించబోతున్నాం" అంటూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్‌ను విడుదల చేయడంతో, ఇది ఒక హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఈ ప్రకటనతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 40 రోజుల షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.మరోవైపు, ఈ టైటిల్ గ్లింప్స్‌ను చిరంజీవి పుట్టినరోజున తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో కూడా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు