
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Sangareddy Collectorate: సంగారెడ్డి విద్యాశాఖలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి.. అక్కడే అన్నట్లుగా తయారైంది. ఒకవైపు డీఈఓ కార్యాలయాన్ని పూర్తిగా కలెక్టరేట్ లోకి తరలించడం.. అదే సమయంలో 15 రోజులుగా డీఈఓ సెలవులో ఉండటంతో.. ఫైళ్లన్ని పెండింగ్ లో పడిపోయాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లు అస్సలు కదలడం లేదు. చెక్ పవర్ డీఈఓ కే ఉండటంతో ఎఫ్ఓసీ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్ శంకర్ కు అప్పగించినా.. ఆయన విధులు మొక్కుబడిగానే సాగుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఇటు ఉద్యోగులు, అటు ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. జాయిన్ అయిన పక్షం రోజులకే సెలవులో డీఈఓ: సంగారెడ్డి జిల్లా విద్యాధికారిగా రోహిణి జూన్ 3న బాధ్యతలు స్వీకరించారు. ఆమె విధుల్లో చేరిన 20 రోజులకే లాంగ్ లీవ్ పెట్టేశారు. మొదట 15 రోజులు సెలవులో ఉన్నారని కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నా.. సంగారెడ్డిలో పనిచేసేందుకు ఆమె సుముఖంగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సెలవును మరికొన్ని రోజులు పొడిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఆర్సీవో గా ప్రమోషన్ వస్తుందన్న ఆలోచనతోనే కొన్ని రోజులు సెలవును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే డీఈఓగా పనిచేసిన 20 రోజుల్లోనూ పాత కార్యాలయం వైపు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపలేదని చర్చ జరుగుతోంది. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న డీఈఓ ఆఫీస్ భవనం పాతబడిపోవడంతో అందులో అడుగుపెట్టేందుకు కూడా రోహిణి సముఖత వ్యక్తం చేయలేదని టాక్. గతంలో హైదరాబాద్ లో పనిచేసిన డీఈఓ సంగారెడ్డి కార్యాలయం చూడగానే ఇదేం ఆఫీస్.. కూలే స్థితిలో ఉన్న ఈ భవనంలో ఎలా ఉంటున్నారని పలువురు ఉద్యోగులతో మాట్లాడినట్లు తెలుస్తోంది