రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవలో యూరియా బుకింగ్
Actor ProfilePolitician

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవలో యూరియా బుకింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవలో యూరియా బుకింగ్
Zee Telugu14 Oct 2026
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవలో యూరియా బుకింగ్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. MeeSeva urea service: తెలంగాణలో యూరియా పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రైతులు తెల్లవారుజాము నుంచే వ్యవసాయ కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. గంటల తరబడి వేచి ఉన్నా, తమకు యూరియా అందుతుందో లేదో కూడా వారికి తెలియదు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ శాఖ యూరియా బుకింగ్ విధానాన్ని సులభతరం చేసింది. నిరక్షరాస్య రైతులకు యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం కష్టంగా ఉన్నందున.. వ్యవసాయ శాఖ మీసేవా కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్‌ను సులభతరం చేసింది. యాప్ ద్వారా బుక్ చేసుకోలేని వారికి మీసేవా కేంద్రాలు మరింత సులభమైన మార్గంగా కనిపిస్తున్నాయి. మీసేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్: రాష్ట్రంలోని రైతులకు రాయితీ యూరియాను సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంచడానికి... యూరియా సకాలంలో పంపిణీ జరిగేలా చూసేందుకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సేవను అందుబాటులోకి తెచ్చింది. ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోలేని రైతులు, తమ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి, ఆపరేటర్ సహాయంతో దానిని బుక్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుడిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీ సేవా సంస్థ, వ్యవసాయ శాఖ సహకారంతో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. *రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ (పీపీబీ) నంబర్‌తో సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది. *మీ సేవా ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి