
ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీలలో చేరాలి అనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీల ఎంపిక


ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీలలో చేరాలి అనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీల ఎంపిక

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు అండదండగా ఉండడానికి అన్ని విధాలా చర్యలు చేపడుతుంది. రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం పంట పెట్టుబడిసాయం అందించే రైతు భరోసా విషయంలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో రైతుబంధు గా ప్రారంభమైన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం రైతు భరోసాగా కొనసాగిస్తోంది.రైతు భరోసా నిధుల పంపిణీ ఏకంగా 46శాతం పెరుగుదల ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు అందించిన మొత్తం నిధుల పంపిణీ ఏకంగా 46 శాతం పెరిగింది. దీంతో ఈ మొత్తం 73,320 కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం 2018లో ఈ పథకం ప్రారంభించినప్పుడు కేవలం భూమి ఉన్న సుమారు 58 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందేది.రెండేళ్లలో 23,070 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు విడుదలకాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిధిని మరింత విస్తృతం చేయడంతో కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో ప్రస్తుతం ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య 73లక్షల మార్కును చేరుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లకాలంలో 50,250 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు తక్కువ కాలంలోనే 23,070 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు విడుదల చేసింది.అత్యధికంగా నల్గొండ జిల్లాకు 5,491 కోట్లు గరిష్ట నిధులుఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 9 లక్షల మంది నిరుపేద వ్యవసాయ కూలీలను సైతం చేర్చి వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక భారం పెరిగినప్పటికీ రైతు సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.