రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్
Actor ProfileActor

రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్
TV9 Telugu23 Sept 2026
రెండేళ్లు దూరంగా ఉన్నా.. క్షమించండి.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్

లెనిన్ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్లో యువ నటుడు అఖిల్ అక్కినేని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు వస్తున్న ఆయన.. తన మాటలతో ఆకట్టుకున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా తాను ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని, వారిని కమ్యూనికేట్ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో, అలాగే ఈ ప్రి-రిలీజ్ వేడుకలో కూడా దీనికి క్షమాపణలు కోరారు. “ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను, అది లెనిన్” అని ఆయన అన్నారు. తనను ప్రేక్షకులు తమ ఇంటి బిడ్డగా భావించి, ఇంటికి తీసుకెళ్లిపోవాలని కోరారు. అప్పుడే తాను సంతోషంగా ఉంటానని, ఆ ప్రయత్నమే లెనిన్ అని స్పష్టం చేశారు. ఈ చిత్ర దర్శకుడు మురళి కిషోర్ గురించి మాట్లాడుతూ, రెండు సంవత్సరాల క్రితం ఆయనను కలిసినప్పుడు చెప్పిన అద్భుతమైన కథ తన మనసులో రన్ అవుతున్న బాధ, ప్రయాణాన్ని ప్రతిబింబించిందని అఖిల్ అన్నారు. కథ వినగానే మురళిని కౌగిలించుకుని, ఈ కథను ఇంకెవరితోనూ చేయవద్దని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. మురళి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ కృతజ్ఞతను జూలై 10న లెనిన్ చిత్రం ద్వారా చూపుతామని హామీ ఇచ్చారు. చిత్ర నిర్మాత వంశీతో తన అనుబంధాన్ని వివరిస్తూ, రెండు సంవత్సరాల క్రితం తాము పార్ట్‌నర్స్‌గా కలిసి ఒక గొప్ప సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కేవలం హిట్ కొట్టడం లేదా బ్లాక్‌బస్టర్ సాధించడం మాత్రమే కాకుండా, అందరికీ ఒక మంచి సినిమాను, కొత్త అనుభూతిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎంతోమంది చేతులు కలిపారని, వారి కృషే ఈరోజు తనను ఈ వేదికపై వర్క్ సాటిస్ఫాక్షన్‌తో నిలబెట్టిందని అన్నారు. ఎడిటర్ నవీన్ నూలి, కొరియోగ్రాఫర్‌లు, ఏడీలు, డీఓపీ లియోన్ బ్రిట్టో వంటి అనేక మంది చిత్ర బృంద సభ్యుల కృషిని ప్రశంసించారు. సంగీత దర్శకుడు తమన్ సినిమాకు ప్రాణం పోశారని, గత