రెండేళ్ల గ్యాప్ కు క్షమాపణలు.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి
Actor ProfileActor

రెండేళ్ల గ్యాప్ కు క్షమాపణలు.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండేళ్ల గ్యాప్ కు క్షమాపణలు.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి
AP7AM23 Sept 2026
రెండేళ్ల గ్యాప్ కు క్షమాపణలు.. నన్ను మీ ఇంటివాడిని చేసుకోండి

అక్కినేని యువ హీరో అఖిల్ తన రాబోయే చిత్రం 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తిరుపతిలో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దాదాపు రెండున్నరేళ్లుగా అభిమానులకు ముఖం చూపించలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. "గ్యాప్ వచ్చేసింది, అందరికీ సారీ. మీతో కమ్యూనికేట్ చేయలేకపోయాననే బాధ నా మనసులో ఉంది. దయచేసి నన్ను మీ ఇంటి వాడిగా చేసుకోండి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లిపోండి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను" అంటూ అఖిల్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను కదిలించాయి.నాలోని బాధే 'లెనిన్' కథఈ సుదీర్ఘ విరామం తర్వాత తాను ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌తో వచ్చానని అఖిల్ తెలిపారు. 'లెనిన్' సినిమా తన జీవితంలోకి ఎలా వచ్చిందో వివరిస్తూ, "రెండేళ్ల క్రితం మీ సీమ బిడ్డ, దర్శకుడు నందు మురళీ కిశోర్ అబ్బూరు ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఆ కథలో నా మైండ్‌లో రన్ అవుతున్న పెయిన్, జర్నీ కనిపించాయి. ఇది నా కోసమే రాశావు, ఇంకెవరితోనూ చేయవద్దని వెంటనే అతడిని హగ్ చేసుకుని చెప్పాను" అని అఖిల్ గుర్తుచేసుకున్నారు. దర్శకుడు నందును తనకు అందించినందుకు ఆయన తల్లిదండ్రులకు వేదికపైనే కృతజ్ఞతలు తెలిపారు. జూలై 10న 'లెనిన్' చిత్రంతోనే వారికి ధన్యవాదాలు తెలియజేస్తామని అన్నారు.టీమ్‌పై ప్రశంసల వర్షంఈ సినిమా ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరినీ అఖిల్ పేరుపేరునా స్మరించుకున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు ప్రాణం పోశాడని, కొన్నిచోట్ల పూనకాలు తెప్పించే సంగీతం ఇచ్చాడని కొనియాడారు