
ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. ఏలూరు జిల్లా, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజల ఉత్సాహం చూస్తూంటే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్టీఏదే విజయం అనిపిస్తుందని తెలిపారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకు పోతున్నామని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం రాకముందు రెండో ప్రపంచ యుద్దంలో పాల్గొన్న వారికి పట్టాలు ఇచ్చారని ప్రస్తావించారు. పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఎవరి ఫొటో వేసుకోవడానికి వీల్లేదు... అప్పటి సమస్యలు ఇప్పుడు పరిష్కారం చేశామని సీఎం వెల్లడించారు. ఇంతకన్నా రాజకీయ జీవితంలో కావాల్సినదేముందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఎవరి ఫొటో వేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో వారు భూములు అడిగితే, ప్రజలు ఇవ్వకపోతే, ఆ భూములను 22ఏ లో పెట్టి ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ఆయా సమస్యలు పరిష్కారం చేస్తే, ప్రజలు జేజేలు కొడతారని పేర్కొన్నారు. ఏం చేయకపోతే 151 సీట్ల పార్టీ ఏమైందో ప్రజలు చూశారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని, పరదాల చాటున రావచ్చని, విమానంలో తిరిగి వెళ్లిపోవచ్చని కానీ జగన్ లాగా తాను చేయనని తెలిపారు. ఇలా చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7700 గ్రామాల్లో 32 లక్షల 32 వేల పాస్ పుస్తకాలు ఇచ్చామని ప్రస్తావించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి పాస్ పుస్తకాలు చేయించామని తెలిపారు. దానిలోని వివరాలు ఎవరు మార్చలేరని అన్నారు




