
సల్మాన్ ఖాన్, రాజ్ అండ్ డీకే కాంబినేషన్‌లో సూపర్ హీరో మూవీ రాబోతున్నట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు లవ్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సల్మాన్ ఖాన్ (Salman Khan), ఇప్పుడు మొదటిసారి కొత్త పంథాలోకి వెళ్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న సూపర్ హీరో జానర్‌లో ఒక ఫ్యామిలీ యాక్షన్ మూవీ తీయడానికి రెడీ అవుతున్నారు. విభిన్నమైన ఐడియాలతో ఓటీటీ, వెండితెరపై సంచలనాలు సృష్టిస్తున్న తెలుగు దర్శకద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఒక విధంగా ఈ కాంబినేషన్ సినీ ప్రేమికులకు పూనకాలు తెప్పించే పాయింటే.. అయితే ఇది రెగ్యులర్ సినిమాగా కాకుండా కాస్త భిన్నంగా ఉండబోతుందట. సాధారణంగా సూపర్ హీరో కథలంటే ముసుగులు తొడుక్కోవడం, ప్రపంచాన్ని రక్షించేందుకు ఆకాశంలో ఎగరడం చూస్తుంటాం. కానీ, రాజ్ & డీకే మార్క్ సూపర్ హీరో కథ దీనికి పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. హాలీవుడ్ హిట్ మూవీ హ్యాంకాక్ తరహాలో సాగే ఈ కథలో కథానాయకుడికి అపారమైన శక్తులు ఉంటాయి. సకల లోకాన్ని రక్షించి అలసిపోయిన ఆ హీరో.. ఇక చాలు ప్రశాంతంగా రిటైర్మెంట్ తీసుకుందాం అని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అనుకోని పరిస్థితులు అతడిని మళ్లీ విధి నిర్వహణలోకి నెడతాయి. బాధ్యతలకు దూరంగా ఉండాలనుకునే ఒక పవర్‌ఫుల్ హీరో, పరిస్థితుల ప్రభావంతో మళ్లీ పోరాటానికి దిగితే వచ్చే కామెడీ, యాక్షన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే ఇది మొదటి పూర్తిస్థాయి సూపర్ హీరో చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్, ఫార్జీ వంటి గ్లోబల్ హిట్ సిరీస్‌లతో తమకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రాజ్ అండ్ డీకే.. సల్మాన్ కోసం ఒక షార్ప్ అండ్ హ్యూమరస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. సల్మాన్‌కున్న తిరుగులేని మాస్ ఇమేజ్‌ను, తమదైన