రాజమహేంద్రవరం ఘటనలోగాయపడిన మెడికల్ స్టూడెంట్ ప్రియాంకకన్నుమూశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ప్రియాంక.. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేసేందుకు వైద్యులు ప్రయత్నించగా.. ఆమె శరీరం అందుకు సహకరించని సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారగా.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో కన్నుమూశారు.ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్‌పూర్. ప్రియాంక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చేస్తున్నారు. ఆగస్ట్ మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌లో మూవీ చూసిన ప్రియాంక.. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి బైక్ మీద బయల్దేరారు. అయితే ఆదిత్య మాల్ గేట్ వద్ద ఆగి ఉన్న సమయంలో నామవరానికి చెందిన దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలయం జోసెఫ్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని మూడుసార్లు ఢీకొట్టారు.ఆ తర్వాత ఆమె పైనుంచి కారును పోనిచ్చారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆగస్ట్ ఐదో తేదీ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించటంతో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర సమయంలో ప్రియాంక కన్నుమూశారు. మరికొన్ని రోజులలో డాక్టర్‌గా సేవలు అందిస్తుందనుకున్న కుమార్తె.. కళ్ల ముందు ఇలా విగతజీవిగా పడి ఉండటం చూసి ప్రియాంక తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.మరోవైపు ఈ కేసులో దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.నిందితులు మద్యం తాగి కారు నడిపినట్లు ఆధారాలు సేకరించామన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్.. వారిపై హత్యాయత్నం కింద కేసు
Actor ProfilePolitician
రాజమండ్రి ఘటనలో గాయపడిన మెడికో ప్రియాంక మృతి.. కిమ్స్ ఆస్పత్రి వైద్యుల ధ్రువీకరణ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•22 Nov 2026
రాజమండ్రి ఘటనలో గాయపడిన మెడికో ప్రియాంక మృతి.. కిమ్స్ ఆస్పత్రి వైద్యుల ధ్రువీకరణ