రాజధానికి సిగ్నేచర్
Actor ProfilePolitician

రాజధానికి సిగ్నేచర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజధానికి సిగ్నేచర్
Andhra Jyothy6 Dec 2026
రాజధానికి సిగ్నేచర్

అమరావతికి గేట్‌ వేగా ఐకానిక్‌ బ్రిడ్జ్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం రూ.వెయ్యి కోట్ల మేరకు వ్యయ అంచనా మంగళవారం ముగిసిన ప్రీ-బిడ్‌ మీటింగ్‌ ఈ నెల 26 వరకు బిడ్‌ దాఖలుకు గడువు గుంటూరు(రాజధాని), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్ఠాత్మకపైన బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం, అమరావతి గ్రోత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏజీఐసీఎల్‌) శ్రీకారం చుట్టాయి. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరుతూ ఏజీఐసీఎల్‌ కొద్దిరోజుల క్రితం టెండర్లను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాయపూడిలోని ఏజీఐసీఎల్‌ కార్యాలయంలో కన్సల్టెన్సీలతో ప్రీ-బిడ్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ వంతెనను ప్రస్తుతం నిర్మించిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుతో అనుసంధానించడం ద్వారా అమరావతికి మరింత మెరుగైన కనెక్టివిటీని కల్పించనున్నారు. ఏజీఐసీఎల్‌ టెండర్ల ప్రకారం కొత్తగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి ‘సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌’గా పేరును ఖరారు చేశారు. హైదరాబాద్‌-మచిలీపట్నం జాతీయరహదారి(ఎన్‌హెచ్‌-65), విజయవాడ నగరాలతో అమరావతి అనుసంధానాన్ని మెరుగుపరచనున్నారు. దీనికిగాను బ్యారేజీకి 300 మీటర్ల దిగువన, అంటే ప్రకాశం బ్యారేజీ, రైలు బ్రిడ్జిలకు మధ్యలో సిగ్నేచర్‌ బ్రిడ్జిని నిర్మిస్తారు. సీతానగరం ఘాట్‌ నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ద్వారా, మచిలీపట్నం-హైదరాబాద్‌ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్‌-65) అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టును చేపడతారు. రాజధానికి గేట్‌వేగా, ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ప్రాజెక్టును 6 వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వంతెనను ఆరు వరుసల రహదారులతోపాటు, రెండువైపులా ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాన్సెప్ట్‌, డిజైన్లు, వ్యయ అంచనాల ఆధారంగా ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ నిర్మిస్తుంది. ప్రాజెక్టు అధ్యయనం కోసం బిడ్‌లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఉంది. ఎంపికైన సంస్థ 3 నెలల్లోగా డీపీఆర్‌ను