రాజకీయాల్లోకి ధనుష్? .. జెండా ఆవిష్కరించిన అభిమానులు
Actor ProfilePolitician

రాజకీయాల్లోకి ధనుష్? .. జెండా ఆవిష్కరించిన అభిమానులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజకీయాల్లోకి ధనుష్? .. జెండా ఆవిష్కరించిన అభిమానులు
AP7AM2 Oct 2026
రాజకీయాల్లోకి ధనుష్? .. జెండా ఆవిష్కరించిన అభిమానులు

తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం... ఇప్పుడు ద్రవిడ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ రాజకీయ అద్భుతాన్ని విజయ్ సాకారం చేయడంతో, ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ అటువైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఒక అధికారిక జెండాను ఆవిష్కరించడం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఇది పక్కా పొలిటికల్ స్కెచ్‌తోనే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యమంత్రి విజయ్ బాటలోనే ధనుష్ కూడా ఇప్పుటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి పూర్తి ప్రణాళికతో పక్కాగా బరిలోకి దిగుతారని కోలీవుడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. మరోవైపు, తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఇంత పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నప్పటికీ... హీరో ధనుష్ వైపు నుంచి గానీ, ఆయన పీఆర్ టీమ్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం