
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ.. బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. అట్లీతో రాకా మూవీ చేస్తున్న బన్నీ.. ఈసినిమాతో 2 వేల కోట్లకు పైగా కలెక్షన్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈమూవీ తరువాత లోకేష్ కనకరాజ్ తో మరో మూవీ ప్లాన్ చేశాడు ఐకాన్ స్టార్.. ఇలా వరుసగా పాన్ ఇండియా మూవీస్ ను కమిట్ అవుతూ వస్తున్న అల్లు అర్జున్.. ఫ్యూచర్ లో రాజకీయ రంగ ప్రవేశానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కొన్నేళ్ళ తరువాత ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని, అందుకే ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడని అంటున్నారు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ తన అభిమాన సంఘాల (Allu Arjun Fans Associations) బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కేవలం సినిమాల ప్రమోషన్లకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని అభిమాన సఘాల ప్రెసిడెంట్లకు ఇంటర్నల్ గా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. విజయ్ తన 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' ద్వారా క్షేత్రస్థాయిలో ఎలాంటి పునాది వేసుకున్నారో.. అల్లు అర్జున్ సైతం తన ఆర్మీ (Allu Arjun Army) ద్వారా అదే తరహా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే సొంత పార్టీ పెడతారా లేక ఇప్పటికే ఉన్న ఏదైనా పార్టీకి సపోర్ట్ ఇస్తారా అనే దానిపై స్పష్టత లేదు. అయితే, గత ఎన్నికల సమయంలో ఆయన కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సపోర్ట్ చేసి ఇలా ప్రకటించడం ద్వారా తనకున్న రాజకీయ ఆసక్తులను పరోక్షంగా బయటపెట్టారు. ఇప్పుడు ఆ అడుగులను మరింత ముందుకు వేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా తనకున్న అభిమాన సంఘాలను ను ఒక వ్యవస్థీకృత శక్తిగా మార్చేందుకు తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశంపై పక్కా ప్లాన్ తో వెళ్ళబోతున్నట్టు