రాజీవ్ గాంధీకి ఘన నివాళి
Actor ProfilePolitician

రాజీవ్ గాంధీకి ఘన నివాళి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజీవ్ గాంధీకి ఘన నివాళి
Eenadu21 Jan 2027
రాజీవ్ గాంధీకి ఘన నివాళి

పర్లాఖెముండి: దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని, దేశ సమగ్రతను కాపాడేందుకు అమరుడయ్యారని కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు బసంత్‌ పండా అన్నారు. గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు కృషి చేసి, పునాదులు వేసిన నాయకుడు అని కొనియాడారు. అదేవిధంగా సుస్థిర పాలన, సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటర్, సెల్ ఫోన్ టెలికాం, ఐటీ రంగాలను అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు