రెజీనా కాసాండ్రా.. నయనతారకు గట్టి పోటీ
Actor ProfileActor

రెజీనా కాసాండ్రా.. నయనతారకు గట్టి పోటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెజీనా కాసాండ్రా.. నయనతారకు గట్టి పోటీ
Chitrajyothy26 Jan 2027
రెజీనా కాసాండ్రా.. నయనతారకు గట్టి పోటీ

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. 2020లో విడుదలైన తొలి భాగానికి భిన్నంగా మరింత గ్రాండ్ స్కేల్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నయనతార (Nayanathara) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman 2). 2020లో విడుదలైన తొలి భాగానికి భిన్నంగా మరింత గ్రాండ్ స్కేల్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుందర్.సి. ఇందులో నయనతారతో పాటు రెజీనా కాసాండ్రా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో రెజీనా, నయనతార, మీనా, కుష్బూ, తదితరులు ఉన్నారు. నయనతార పాత్రకు ఎదురు నిలిచే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఇప్పటివరకు కనిపించని డార్క్ అవతార్‌లో రెజినా సర్‌ప్రైజ్ చేయనుందట. దర్శకుడు సుందర్.సి ఆమె పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. రెజీనా కెరీర్‌లోనే అత్యంత ఛాలెంజింగ్ పాత్రల్లో ఇదొకటిగా నిలవబోతుందని తెలిసింది. గతంలో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన ఈ క్యారెక్టర్‌లో ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక నయనతార, రెజీనా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్. దీంతో ‘మూకుత్తి అమ్మన్ 2’లో హీరోయిజంతో పాటు హీరోయిన్ వర్సెస్ యాంటీ హీరోయిన్ తరహా ఆసక్తికరమైన కాన్ఫ్లిక్ట్‌ను కూడా ప్రేక్షకులు చూడబోతున్నారని సమాచారం. నయనతార స్టార్ పవర్‌కు రెజీనా డార్క్ పెర్ఫార్మెన్స్ తోడైతే ‘మూకుత్తి అమ్మన్ 2’ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రెజీనా ఏ రేంజ్‌లో తన పాత్రను పండించిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే