రంజుగా వినాయకచవితి వార్
Actor ProfileActor

రంజుగా వినాయకచవితి వార్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రంజుగా వినాయకచవితి వార్
Chitrajyothy6 Nov 2026
రంజుగా వినాయకచవితి వార్

ఈ యేడాది వినాయక చవితికి విజయ్ దేవరకొండ, కార్తీ, ఫహద్ ఫాజిల్‌ నటించిన 'రణబాలి', 'సర్దార్ 2', 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడబోతున్నాయి. ఈ యేడాది వినాయక చవితి పండగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో రంజైన పోటీ నెలకొంది. మూడు భాషలకు చెందిన యంగ్ స్టార్ హీరోస్ మూవీస్ ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ వివాహానంతరం వస్తున్న తొలి చిత్రంగా 'రణబాలి'పై స్పెషల్ క్రేజ్ నెలకొని ఉంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు టీ సీరిస్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 1854 నుంచి 1878 మధ్య జరిగే కాలానికి సంబంధించిన చారిత్రక చిత్రమిది. దీనికి అజయ్ - అతుల్ సంగీతం అందిస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం వచ్చిన తమిళ అనువాద చిత్రం 'సర్దార్' కార్తీకి మంచి పేరు తెచ్చిపెట్టంది. అందులో కార్తీ తండ్రీ కొడుకులుగా నటించి మెప్పించాడు. దాంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'సర్దార్ 2' మూవీని తెరకెక్కిస్తున్నారు. పి.యస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య కీలక పాత్రను పోషిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చుతున్నాడు. 'సర్దార్ 2' సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అలానే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు 'పుష్ప' సీరిస్ లో పవర్ ఫుల్ విలన్ గా నటించిన ఫహద్ తొలిసారి తెలుగులో 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మ్యాజికల్ మూవీ సెప్టెంబర్ 11న విడుదల కాబోతోంది. దీనిని