
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Government Schools Closed: దేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ తీరుపై యూడీఐఎస్ఈ తాజా నివేదిక ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గత 2025-26 విద్యా సంవత్సరంలో దేశంలో రోజుకు సగటున 13 ప్రభుత్వ పాఠశాలలు మూతపడినట్లు నివేదిక పేర్కొంది. ఏడాది కాలంలోనే ఏకంగా 4,791 పాఠశాలలకు తాళాలు పడినట్లు ఈ రిపోర్టు స్పష్టం చేసింది. గత 2024-25 విద్యా సంవత్సరంలో దేశంలో మొత్తం 14,71,473 పాఠశాలలు ఉండగా.. 2025-26 నాటికి ఆ సంఖ్య 14,66,682కి పడిపోయింది. అయితే, పాఠశాలల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం స్కూళ్ల విలీనం అని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోనే సగానికి పైగా: ఈ స్కూళ్ల మూసివేత జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా పాఠశాలలు మూసివేశారు. దేశవ్యాప్తంగా మూతపడిన మొత్తం పాఠశాలల్లో సగం కంటే ఎక్కువ ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో ఏడాది కాలంలో ఏకంగా 2,426 ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి: దేశంలో అత్యధికంగా పాఠశాలలు మూతపడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో ఏకంగా 1,392 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో పెరిగిన స్కూళ్లు.. తగ్గిన విద్యార్థులు: మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా పాఠశాలల సంఖ్య పెరిగింది. బీహార్‌లో కొత్తగా 946, ఛత్తీస్‌గఢ్‌లో 234, ఢిల్లీలో 87 పాఠశాలలు ఏర్పాటయ్యాయి. అయితే, కొత్త స్కూళ్లు వచ్చినప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం బీహార్‌లో 4,37,037