రాక్ స్టార్ దేవిశ్రీ బా బా బ్లాక్ షీప్ ’ ఫ స్ట్ లిరిక ల్ ఆజా మేరీ
Actor ProfileActor

రాక్ స్టార్ దేవిశ్రీ బా బా బ్లాక్ షీప్ ’ ఫ స్ట్ లిరిక ల్ ఆజా మేరీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాక్ స్టార్ దేవిశ్రీ బా బా బ్లాక్ షీప్ ’ ఫ స్ట్ లిరిక ల్ ఆజా మేరీ
Chitrajyothy24 Dec 2026
రాక్ స్టార్ దేవిశ్రీ బా బా బ్లాక్ షీప్ ’ ఫ స్ట్ లిరిక ల్ ఆజా మేరీ

దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ విడుదల చేశారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’ (Baa Baa Black sheep). అనుకోకుండా జ‌రిగే ఓ ఘ‌ట‌న.. కొన్ని జీవితాల్లోనూ అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టానికి కార‌ణ‌మైతే.. అలాంటి ఓ వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాల‌యా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను ఏర్పడేలా చేయగా, తాజాగా మేకర్స్ చిత్ర విడుదల తేదీతో పాటు, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ విడుదల అనంతరం దేవిశ్రీప్ర‌సాద్ మాట్లాడుతూ.. సాంగ్ యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంద‌ని, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుతూ.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇక ‘ఆజా మేరీ జాని’ సాంగ్ విష‌యానికి వ‌స్తే.. ఇదొక పార్టీ సాంగ్‌ అని తెలుస్తోంది. ప్ర‌ధానంగా అక్షయ్ ల‌గుసాని, విష్ణు ఓయ్ ల‌పై ఈ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా చిత్రీక‌రించారు. ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ) సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం అందించగా.. బెన్నీ ద‌యాల్ పాడారు. ఈ పాట విడుదల సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌ వేణు దోనేపూడి మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్